విషగుళికలు మింగి ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
06:54 March 09
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషగుళికలు మింగి రామకృష్ణ(45), అతని భార్య రాజేశ్వరి (35), దేవేంద్ర(14) ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని గ్రామస్థులంటున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న సీఐ కృష్ణా రెడ్డి మృతదేహాలను పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: