ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడో విడతకు నామినేషన్లు.. రెండో రోజు జోరుగా దాఖలు - రెండోరోజు నామినేషన్ల తాజా వార్తలు

అనంతపురం జిల్లాలోని అనంతపురం రూరల్ మండల పరిధిలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద పార్టీలకు చెందిన అభ్యర్థులు... నామపత్రాలు సమర్పిస్తున్నారు.

2nd day nominations in anantapur
అనంతపురం మండలంలో సజావుగా నామినేషన్ల స్వీకరణ

By

Published : Feb 7, 2021, 4:25 PM IST

మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అనంతపురం జిల్లాలో అధికారులు రెండోరోజు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పంచాయతీలకు చెందిన అభ్యర్థులు.. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

మొదటి రోజు (శనివారం) 48 సర్పంచ్ అభ్యర్థులు, 115 వార్డు అభ్యర్థులు ప్రమాణపత్రాలు దాఖలు చేశారు. ఈ రోజు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగేలా పోలీసులు... పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details