ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని రైతుల నిరసన - Anantapur crop damage news
వేరుశనగ పంట నష్టపోయిన తమకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు.
![ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని రైతుల నిరసన 25 thousand per acre to pay compensation protest at ananthapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9054049-984-9054049-1601880146536.jpg)
అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అధిక వర్షాలు కురవటంతో 12 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట తీవ్రంగా దెబ్బతిన్నదని రైతులు ఆవేదన చెందారు. వేరుశనగ పంటతో పాటు పండ్లతోటలు, కాయగూరల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పంటను పరిశీలించి...ప్రభుత్వానికి నివేదికను అందించాలన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.25వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.