2023 effect record revenue increased in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం పొంగిపొర్లింది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.142 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయాలే లక్ష్యంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలో నిర్దేశిత సమయం కంటే అదనంగా మరో మూడు గంటలు విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది.
దీంతో ప్రభుత్వ దుకాణాల్లో అర్ధరాత్రి 12 గంటల వరకూ, బార్లలో అర్ధరాత్రి 1 గంట వరకూ విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో సాధారణంగా రోజుకు రూ.70-72 కోట్ల మద్యం అమ్ముతారు. కానీ ఈసారి డిసెంబరు 31న ఒక్కరోజే రెట్టింపు విక్రయాలు జరిగాయి. ప్రభుత్వ దుకాణాల్లో రూ.127 కోట్లు, బార్లలో రూ.15 కోట్ల విలువైన మద్యం అమ్మారు.