అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం ఉదుగూరులో 172 కర్ణాటక మద్యం ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ అంజనేయులు, పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. మురుకానప్ప అనే వ్యక్తి వద్ద మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని...అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మడకశిర నియోజకవర్గం చుట్టూ కర్ణాటక ప్రాంతం ఆనుకొని ఉన్నందున గ్రామాల్లో మద్యం విక్రయాలు అధికమ్యయాయి. వీటిని అరికట్టేందుకు స్థానిక పోలీసులు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక కార్యాచరణతో దాడులు నిర్వహిస్తున్నారు.