అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో నాల్గో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుడిబండ మండలం సింగేపల్లి గ్రామానికి చెందిన 35 కుటుంబాలు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో తెదేపాలో చేరాయి. అధికారంలో ఉన్న వైకాపా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని... తెదేపాతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరామని వారు పేర్కొన్నారు.
'వైకాపా అభివృద్ధి చేయట్లేదు.. తెదేపాలో చేరుతున్నాం' - తెదేపాలో చేరిన సింగేపల్లి గ్రామస్థలు
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ముందు అధికార వైకాపా మద్దతుదారులు పార్టీ మారారు. సింగేపల్లి గ్రామంలో వైకాపాకు చెందిన 35 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వీరి చేరికతో సింగేపల్లిలో తెదేపా బలపడబోతోందని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
!['వైకాపా అభివృద్ధి చేయట్లేదు.. తెదేపాలో చేరుతున్నాం' 150 people from singepalli village joined in tdp in anantapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10448308-1078-10448308-1612091763858.jpg)
తెదేపాలో చేరిన 150 మంది వ్యక్తులు