ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో 15 టన్నుల బెల్లం స్వాధీనం

అనంతపురం జిల్లా వెలుగమాకులపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో (ఎస్ఈబీ) ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో తమిళనాడు నుంచి హైదరాబాద్​కు అక్రమంగా లారీలో తరలిస్తున్న 15 టన్నుల బెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఈబీ అసిస్టెంట్​ కమిషనర్​ వెల్లడించారు.

అనంతలో 15 టన్నుల బెల్లం స్వాధీనం
అనంతలో 15 టన్నుల బెల్లం స్వాధీనం

By

Published : May 26, 2020, 8:19 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని వెలుగమాకులపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఎస్ఈబీ(స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో) ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ దాడుల్లో తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ జిల్లా పిలకలపాళేం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తరలిస్తున్న రూ.5.97లక్షల విలువ చేసే 15 టన్నుల బెల్లంను అధికారులు పట్టుకున్నారు. 500 బెల్లం బస్తాలతో పాటు లారీని సీజ్ చేసినట్లు ఎస్ఈబీ అసిస్టెంట్​ కమిషనర్ విజయశేఖర్​ తెలిపారు. లారీ డ్రైవర్​ను అరెస్ట్ చేసి... యజమాని దేవేందరదాస్ మిల్టన్​ దురై​పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బెల్లంను నాటుసార తయారిదారులకు విక్రయించేందుకు హైదరాబాద్​లోని శాంతినగర్​కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సచివాలయం గోడకు కన్నం వేసి చోరీ

ABOUT THE AUTHOR

...view details