ఉరవకొండలో ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - corona cases latest update news
ఒకేరోజు 14 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులను నియంత్రించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూనే, ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఒకేరోజు 14 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో మొత్తం కరోనా కేసులు 22కు పెరగడం వల్ల మూడు చోట్ల కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. మాస్కు లేకుండా బయటకు తిరిగితే జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్నవారు ఎవరూ బయటకు వెళ్లకుండా.. ఇతర ప్రాంతాల వారు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వైరస్ నిర్ధారణ అయినవారితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి, వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు వెల్లడించారు.