rape on minor girl: అనంతపురం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం - అనంతపురం జిల్లాలో బాలికపై అత్యాచారం
17:02 September 10
12 ఏళ్ల బాలికపై అత్యాచారం
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రమేశ్(42)పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను కొంతకాలంగా అనుసరిస్తున్న నిందితుడు రమేశ్.. శుక్రవారం ఆమె బహిర్భూమికి వెళ్లిన సమయంలో వెంబటించి నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రమేశ్ గ్రామంలో నాటుసారా విక్రయిస్తూ.. జీవనం సాగిస్తుంటాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..