తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో విషాదం జరిగింది. లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌లో 11 నెలల బాబు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. భైంసా పట్టణానికి చెందిన జలావర్ సురేశ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కనకాపూర్‌లో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. గురువారం ఉదయం వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెట్టి బయట షాప్‌కి వెళ్లాడు. అతని భార్య స్వరూప ఇంటి పని చేసుకుంటూ ఉంది. ఈ సమయంలో 11 నెలల బాబు ఆడుకుంటూ వెళ్లి హీటర్ని ముట్టుకున్నాడు. అంతే... కరెంటు షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.
విద్యుదాఘాతంతో 11 నెలల బాలుడు మృతి - నిర్మల్ జిల్లా వార్తలు
వాటర్ హీటర్ షాక్ కొట్టి 11 నెలల బాబు మరణించాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో జరిగింది. బాబు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

విద్యుదాఘాతంతో 11 నెలల బాలుడు మృతి