రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుడిబండ మండలం మోరుబాగల్ గ్రామంలో జరిగింది. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి... మరొకరి పరిస్థితి విషమం - అనంతపురం జిల్లా తాజా సమాచారం
అనంతపురంలోని గుడిబండలో ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొని ఒక వ్యక్తి చనిపోయాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తిమ్మలాపురానికి చెందిన నరసింహమూర్తి అనే వ్యక్తి, మోరుబాగల్కి చెందిన బాబు అనే వ్యక్తి కలిసి... ద్విచక్ర వాహనంపై అరిగెర గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో... ఎదురుగా వస్తున్న మరొక బైక్ ఈ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బాబుకు తీవ్రగాయాలు కావడంతో 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ ఉపాధ్యాయురాలి నుంచి నగదు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు!