YSRCP Leaders Occupying Ponds :అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలో వేసినభారీ లేఔట్ నిజానికి ఇది వాగులు, గెడ్డలు ప్రవహించే మార్గం. ఆ మార్గాన్నే ఇలా తొలిచేసి మలిచేశారు. ఒకట్రెండు కాదు, దాదాపు పదెకరాలు చెరబట్టినట్లు అధికారుల సర్వేలోనే తేలింది. ఈ కబ్జాతో రంగబోలు గెడ్డ రిజర్వాయర్‌లోకి నీళ్లు చేరడం లేదని స్థానిక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కబ్జాకోరులు సాక్షాత్తూ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరులే.
Occupying Ponds in AP :ఓ స్థిరాస్తి వ్యాపారి వ్యవసాయ క్షేత్రం. కాకపోతే ఇందులో అసలు ఎంతుందో ఆక్రమణ కూడా అంతే ఉంది. అనకాపల్లి జిల్లా తారువ గ్రామం, సర్వే నంబర్ 179లో రెడ్డివారి చెరువు ఉంది. ఈ చెరువులో 4.17 ఎకరాలను స్థిరాస్తి వ్యాపారి తన వ్యవసాయక్షేత్రంలో కలిపేసుకున్నారు. చదును చేసేసుకున్నారు. మరి మన అధికారులు ఊరుకుంటారా? అక్కడి వెళ్లారు. ఇదిగో ఈ హెచ్చరిక బోర్డ్ పెట్టేసి పలాయనం చిత్తగించారు. సదరు స్థిరాస్తి వ్యాపారి బోర్డును పీకిపక్కనేశారు. చెరువు గర్భాన్ని దర్జాగా మాయం చేశారు. ఏంటీ ఆయన ధైర్యం అంటారా? ఆయనకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఆశీస్సులున్నాయి. ఈ ఊరుకూడా ముత్యాల నాయుడు స్వగ్రామమే. అందుకే అధికారులు ఆయనతో మనకెందుకుకొచ్చిన గొడవంటూ అటు వైపే చూడడం లేదు.
Pulikunta Pond చెరువుపై వారి కన్ను పడింది..! ఇంకేముంది.. స్థిరాస్తిగా మార్చేందుకు ఇలా స్కెచ్ వేశారు!
కమ్యూనిటీ హాళ్లు కట్టాలి-అందుకే చదును చేశాం : ఇక గుంటూరు జిల్లా పెదకాకాని సర్వే నెంబరు 653లోని రజక చెరువునూ వైఎస్సార్సీపీ నాయకుల్లో ఒక వర్గం చెరబట్టింది. శివాలయం రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా అక్కడ తొలగించిన మట్టిని ఈ చెరువులో డంప్ చేయించారు. చదును చేసి ఖాళీ స్థలంగా మార్చారు. ఇదేంటని అధికారులు ప్రశ్నిస్తే అక్కడ కమ్యూనిటీ హాళ్లు కట్టాలని హూంకరించారు. అలా చేయడానికి వీల్లేదని, ఆ చెరువులోకి ఎవరూ వెళ్లొద్దంటూ తహశీల్దార్ ఆదేశించారు. ఆక్రమణలు మాత్రం అలాగే ఉన్నాయి.
మొక్కుబడిగా హెచ్చరిక బోర్డు : గుంటూరు నగరంలోని SVNకాలనీ వెనుకగా ఉండే నేతాజీ నగర్ చెరువు. ఒకప్పుడు పదెకరాలకుపైగా ఉండేది. ఇప్పుడు కబ్జా కోరల్లా కరిగిపోయి రెండకరాలే మిగిలింది. గృహనిర్మాణ వ్యర్థాలను ఆ చెరువులో డంప్ చేస్తున్నారు. ఆ తర్వాత చదున చేసి ఇల్లు నిర్మిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల అండదండలుండడంతో కార్పొరేషన్ అధికారులు కబ్జాకోరుల జోలికెళ్లడం లేదు. మొక్కుబడిగా ఇలా హెచ్చరిక బోర్డుపెట్టి చేతులు దులిపేసుకున్నారు.