ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలొగ్గలేదని.. ఓ మహిళ పూరి గుడిసెను కూల్చేసిన వైకాపా నాయకుడు

Anakapalli: స్థానిక వైకాపా నాయకుడితో గడిపేందుకు ఒప్పుకోలేదని.. తమ పూరి గుడిసెను తొలగించారని.. ఓ మహిళ ఆరోపించారు. ఒంటరి మహిళగా ఉన్న తనను.. అధికార పార్టీకి చెందిన కొందరు గ్రామస్థాయి నాయకులు.. రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు.

By

Published : Nov 17, 2022, 10:19 AM IST

women
ఓ మహిళ

Anakapalli: స్థానిక వైకాపా నాయకుడితో గడిపేందుకు ఒప్పుకోలేదని.. తమ పూరి గుడిసెను తొలగించారని.. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కొత్త ఎల్లవరానికి చెందిన ఓ మహిళ ఆరోపించారు. ఒంటరి మహిళగా ఉన్న తనను.. అధికార పార్టీకి చెందిన కొందరు గ్రామస్థాయి నాయకులు.. రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు.

ఓ చెరువు స్థలంలో ఉన్న తమ పూరిగుడిసె పైకప్పు పనులు చేస్తుండగా.. ఐదు రోజుల క్రితం రెవెన్యూ, జలవనరుల అధికారులు అడ్డుకున్నారు. బాధితురాలు వారిని ఎంత ప్రాధేయపడినా వినకుండా అధికారులు.. పూరిగుడిసెను కూల్చేశారు. వైకాపా నాయకుల ప్రోద్బలంతోనే తన ఇంటిని కూల్చేస్తున్నారంటూ మనస్తాపానికి గురైన మహిళ.. చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించారు.

స్థానికులు ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు. పూరిగుడిసెపై తాటికొమ్మలు వేసి.. తాత్కాలికంగా ఉండేందుకు సాయం చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు.. పోలీసు బలగాలతో తిరిగి వచ్చి.. పూరిగుడిసెను పూర్తిగా తొలగించేశారు. దీంతో నిరాశ్రయులైన బాధితురాలు.. తన ఆరేళ్ల కుమారుడితో స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో తలదాచుకుంటున్నారు.

విషయం తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు.. బాధిత మహిళను పరామర్శించి.. న్యాయం జరిగే వరకూ పోరాడతామని ధైర్యం చెప్పారు. బాధితురాలి పరిస్థితికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. తహసీల్దారు, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయాల్లో... తెలుగుదేశం నేతలు వినతిపత్రాలు అందజేశారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details