Attack: అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన 19 ఏళ్ల యువతి సిద్ధా స్వాతిపై వరసకు బావ అయ్యే యువకుడు కిరాయి వ్యక్తితో దాడి చేయించిన దారుణమిది. ఎస్సై పి.రామారావు, బంధువుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం స్వాతి ఇంటి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని అమ్మమ్మ అప్పలనర్సమ్మతో కలసి శుభ్రం చేస్తోంది. ఆ సమయంలో ఇదే గ్రామానికి చెందిన పండ్ల వ్యాపారి గండెం నాగేశ్వరరావు (35) బ్లేడుతో స్వాతి మెడపై కోసి పరారయ్యాడు. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. నాగేశ్వరరావుపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఏఎస్పీ శ్రావణి, డీఎస్పీ బి.సునీల్‌కుమార్, సీఐ సయ్యద్ ఇలియాస్ మహ్మద్ బాధితురాలి ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఆమెపై ఇదే తరహా దాడి 2 నెలల క్రితం కూడా జరిగింది.
Attack: యువతిపై బ్లేడుతో యువకుడు దాడి.. కారణం ఏంటి? - అనకాపల్లి జిల్లాలో యువతి మెడపై బ్లేడుతో దాడి చేసిన యువకుడు
Attack: అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో యువతి మెడపై నగేష్ అనే వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.
రూ.10 వేలకు సుపారీ:స్వాతికి వరసకు బావ అయిన అప్పాన కొండలరావుతో పెళ్లి చేయాలని కుటుంబపెద్దలు అనుకున్నారు. ఆయనకు మరో అమ్మాయితో మే 4న పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి స్వాతి అడ్డంకిగా మారుతుందనే అనుమానంతో కొండలరావు.. పండ్ల వ్యాపారి నాగేశ్వరరావుతో రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకుని దాడి చేయించాడని స్వాతి తల్లి, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి కొండలరావు మోసం చేశాడని చెప్పారు. బాధితురాలిని తెదేపా మాడుగుల ఇన్‌ఛార్జి పీవీజీ కుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమా వేర్వేరుగా పరామర్శించారు..
ఇదీ చదవండి:Family suicide attempt: విజయవాడలో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అప్పులే కారణమా..!