Two Lorries Stuck On The Road: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి-కొత్తవలస ప్రధాన రోడ్డులో ఆనందపురం సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీల చక్రాలు రోడ్డులో దిగిపోయాయి. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొత్తవలస-దేవరాపల్లి ప్రధాన రోడ్డులో.. దేవరాపల్లి నుంచి ఆనందపురం వరకు రోడ్డు పనులు రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అయితే దేవరాపల్లి నుంచి ఆనందపురానికి మధ్యలో ఉన్న వావిలపాడు కూడలి వరకు మాత్రమే పనులు పూర్తి చేశారు. మిగిలిన రోడ్డు పని చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. గుత్తేదారుడుకి బిల్లులు రాకపోవడంతో పనులు చేపట్టలేదు. దీంతో అసంపూర్తిగా వదిలేసన రోడ్డు పెద్దగా గోతులు ఏర్పడి, వర్షానికి మరింత అధ్వానంగా తయారైంది. అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు వర్షానికి నానిపోవటంతో.. లారీల చక్రాలు రోడ్డు మధ్యలో దిగిపోయాయి. రెండు ఒకే దగ్గర ఎదురెదురుగా దిగిపోవటంతో.. వాహనాలు నిలిచిపోయాయి.
అసంపూర్తిగా పనులు.. రోడ్డుపై గోతిలో దిగబడ్డ లారీలు - ట్రాఫిక్కు అంతరాయం
Road Problems: అనకాపల్లి జిల్లాలో దారి మధ్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీల చక్రాలు రోడ్డులోకి దిగిపోయాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లారీలను అక్కడి నుంచి తొలగించే వరకు.. ఆ దారిగుండా వెళ్లే వాహనాలు ప్రయాణానికి వీలు లేకుండా పోయింది.
Etv Bharat