Suspension of employees: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలిక మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ వద్ద అక్రమంగా రంగురాళ్ల తవ్వకం ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అటవీ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సాలిక మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఈనెల 21వ తేదీ రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రెండు జేసీబీలు, 10 ట్రాక్టర్లతో రంగురాళ్ల అన్వేషణలో భాగంగా మట్టి తవ్వకాలు జరిపిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఉదయాన్నే నర్సీపట్నం అటవీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు డీఎఫ్ రాజారావు ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని సందర్శించి ఎంత మేరకు తవ్వారో కొలతలు తీసి రికార్డు చేశారు.
దీనిపై స్క్వాడ్ డీఎల్వి శ్యాంసుందర్ రంగురాళ్ల క్వారీ వద్ద విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లోవ కుమార్ తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ ఉద్యోగి మహేష్ లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. నిషేధిత ప్రాంతంలో రంగు రాళ్లు తవ్వకానికి ప్రయత్నించి మట్టి తవ్వి తరలించుకుపోయిన వారికోసం తీవ్రంగా గాలిస్తున్నామని కరక, ఆరిలోవ, సాలిక మల్లవరం తదితర ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులను అనుమానిస్తున్నామని త్వరలోనే వీరిపైన చర్యలు తీసుకుంటామని శ్యామ్‌సుందర్ వెల్లడించారు.
జరిగిన విషయం ఇది :
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలికమర్లవరం వద్ద రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. జరిగిన ఘటన పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఇందులో ఎవరెవరికి సంబంధం ఉందో అందరిపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు అనకాపల్లిలో ఆయన వీడియో విడుదల చేశారు. ఈ రంగురాళ్ల తవ్వకం ఘటనలో అటవీ, పోలీస్ శాఖ అధికారుల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై, అటవీ శాఖ అధికారుల ఫోన్లను తక్షణమే స్వాధీనం చేసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రంగురాళ్ల తవ్వకందారుల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తము ఉందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు దీంతోపాటు లెటరైట్ తవ్వకాలు అక్రమ గంజాయి రవాణా తదితర కేసులపై తక్షణమే విచారణ జరిపించాలని అయ్యన్న డిమాండ్ చేశారు.
అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తా..!అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలికమర్లవరం వద్ద రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనలో ఎవరెవరికి సంబంధం ఉందో అందరిపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: