Tribals Protest in Deputy CM's own Mandal: ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత మండలంలోనే సరైన రహదారులు లేవంటూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట మండలంలోని పలు గ్రామానికి చెందిన గిరిజనులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ఓట్లేసి తప్పుచేశామంటూ.. చెప్పులతో కొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత మండలంలోని గ్రామాలైన కోడాపల్లి, రామన్నపాలెం, కే.టీ.పాలెం, వాలాబు నుంచి కోనాం వరకు, తాటిపూడి వీరభద్రపేట, నేరేళ్లపూడి, బోడిగరువు గిరిజన గ్రామాలకు లింకు రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. డిప్యూటీ సీఎం, ఎంపీడీవోకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన కరువైందన్నారు. ఈ ప్రభుత్వానికి ఓట్లేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
'ఈ ప్రభుత్వానికి ఓట్లేసి తప్పు చేశాం.. చెప్పుతో కొట్టుకుంటున్నాం' - రోడ్లకోసం గిరిజనుల వినూత్న నిరసన
Tribals Protest: "ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం" అంటూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట పలు గిరిజన గ్రామాలకు చెందిన ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంత మండలమైన దేవరాపల్లిలోని పలు గ్రామాల్లో సరైన రోడ్లు లేవని..,ఈ విషయమై ఆయనకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ఓట్లేసి తప్పు చేశామంటూ చెప్పులతో కొట్టుకుంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
'ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం'
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు ఓట్లేయలేదనే అక్కసుతో ఉపముఖ్యమంత్రి తమ గ్రామాలపై కక్షసాధింపులకు దిగుతున్నారన్నారు. మండలంలో వాళ్లకు అనుకూలంగా ఉండే గ్రామాలకు మాత్రమే రహదారులు నిర్మిస్తున్నారని.. గిరిజనుల అభివృద్ధిని గాలికొదిలేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా తమ గ్రామాలకు రోడ్లు నిర్మించాలని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి