Tiger wandering in kotauratla Mandal: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం టీ.జగ్గంపేట శివారు తాడిపత్రి- శ్రీరాంపురం గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటలో పెద్ద పులి జాడ కనిపించింది. శ్రీరాంపురం గ్రామానికి చెందిన చిన్న అనే రైతు పాడి గేదెపై పులి పంజా విసిరింది. అనంతరం పక్కనే ఉన్న పెద్ద కొండ పైకి వెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నర్సీపట్నం ఫారెస్ట్ అధికారులు.. పులి సంచరిస్తున్న ప్రదేశాన్ని గుర్తించే పనిలో పడ్డారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అనకాపల్లి జిల్లాలో పులి సంచారం.. పాడి గేదెపై దాడి - Tiger wandering in kotauratla Mandal
Tiger in anakapalle district: ఇన్ని రోజులూ కాకినాడ జిల్లా వాసులను హడలెత్తించిన పులి.. ఇప్పుడు అనకాపల్లి జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కోటవురట్ల మండలం శ్రీరాంపురంలో ఓ గేదెపై పులి పంజా విసిరడం.. తోటల్లో పులి అడుగులు కనిపించడంతో.. స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు.
![అనకాపల్లి జిల్లాలో పులి సంచారం.. పాడి గేదెపై దాడి Tiger wandering in kotauratla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15688692-449-15688692-1656496357426.jpg)
Tiger wandering in kotauratla