ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Thadi Villagers Suffering with Industrial Pollution: కల నెరవేరేనా.. కాలుష్యం నుంచి విముక్తి కలిగేనా..? తాడి గ్రామస్థుల ఆవేదన

Thadi Villagers Suffering with Industrial Pollution: 'ఫార్మా' కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న 'తాడి' గ్రామం తరలింపుపై.. ముఖ్యమంత్రి మీనమేషాలు లెక్కిస్తున్నారు. వారం పది రోజుల్లో విముక్తి కల్పిస్తామని.. ఏడాదిన్నర క్రితం బహిరంగ హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. నిర్బయంగా గాలికొదిలేశారు. ఇప్పటికే ఫార్మా సంస్థల కాలుష్యంతో ఇబ్బందిపడుతున్న వారిపై.. పుండుమీద కారంలా.. ఇక్కడ నేడు మరో కంపెనీకి సీఎం జగన్‌ భూమిపూజ చేయబోతున్నారు.

Thadi Villagers Suffering with Industrial Pollution:
Thadi Villagers Suffering with Industrial Pollution:

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 8:08 AM IST

Updated : Oct 16, 2023, 9:08 AM IST

Thadi Villagers Suffering with Industrial Pollution: కల నెరవేరేనా.. కాలుష్యం నుంచి విముక్తి కలిగేనా..? తాడి గ్రామస్థుల ఆవేదన

Thadi Villagers Suffering with Industrial Pollution: కాలుష్యం భూతం చుట్టుముట్టిన తమ గ్రామాన్ని తరలించాలని వేడుకుంటున్న ‘తాడి’ గ్రామస్థుల కల నెరవేరడం లేదు. ఫార్మా కంపెనీల దగ్గరలో ఉన్న తమ ఊరి ప్రజల బాగోగులు పట్టించుకోవాలని వేడుకుంటున్నా పాలకులు రోజులు గడిపేస్తున్నారని వాపోతున్నారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి హామీ కూడా.. చెప్పిన సమయానికి నెరవేరకపోవడం కలవరపరుస్తోందంటున్నారు. గ్రామాన్ని తరలిస్తామని ప్రకటన చేసినా ఎటువంటి కదలిక లేకపోవడంతో స్థానికుల్లో మళ్లీ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

వారం, పది రోజుల్లో తాడి గ్రామానికి న్యాయం చేస్తామని సీఎం జగన్ 2022 ఏప్రిల్ 28న అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని.. పైడివాడ అగ్రహారంలో ఇళ్లపట్టాల పంపిణీ బహిరంగ సభలో మాట ఇచ్చారు. ముఖ్యమంత్రే అంతగా హామీ ఇచ్చారంటే.. ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ గ్రామాన్ని తరలిస్తామని చెప్పి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదు. పచ్చని చెట్లు, పంట పొలాలతో అనకాపల్లి జిల్లాలోని పరవాడ మండలం తాడి గ్రామం ఒకప్పుడు కళకళలాడేది.

Paravada Pharmacity: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దుర్భర పరిస్థితుల్లో తాడి ప్రజలు

2 వేలు జనాభా ఉన్న ఈ గ్రామాన్ని ఆనుకుని పదిహేనేళ్ల క్రితం ఫార్మాసిటీ ఏర్పాటైంది. ఈ గ్రామానికి, ఫార్మా సంస్థలకు మధ్య చిన్న రహదారే హద్దు. ఫార్మా సంస్థల నుంచి విడుదలయ్యే ఘాటైన వాసనలతో ఇక్కడి ప్రజలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దుర్వాసన భరించలేక అల్లాడిపోతున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితం అయ్యాయి. ఒంటిపై పుళ్లు, దద్దుర్లు చూపించి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

గ్రామ తరలింపుపై సీఎం హామీ తర్వాత ప్రజలు పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్‌ రాజును అనేకసార్లు కలిశారు. అదిగో.. ఇదిగో అంటూ ఆయన కాలయాపన చేస్తున్నారు. సీఎంవోలో అధికారులను కలిసి వచ్చానని, త్వరలో జీవో వచ్చేస్తోందని ఇటీవల మళ్లీ హడావుడి చేశారు. అయినా ఇంత వరకు తరలింపుపై ఉత్తర్వులు రాలేదు. గ్రామంలో గడపగడపకీ కార్యక్రమం నిర్వహించడానికి ఎమ్మెల్యే ముఖం చాటేశారు. ఈ తరుణంలో సీఎం జగన్.. ఇవాళ ఫార్మాసిటీలో పర్యటనకు వస్తుండటంతో..సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు తాడి గ్రామస్థులు సమాయత్తం అవుతున్నారు.

‘తాడి’ వాసుల కష్టాలు... ముందుకు సాగని గ్రామ తరలింపు

"చాలా దారుణమైన వాసన వస్తోంది. భరించలేక పోతున్నాము. ఓట్లు వేయకముందు వరకూ.. ఇదిగో అదిగో అంటారు. ఓట్ల వేశాక అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు ఎప్పుడు ఖాళీ చేపిస్తారో తెలియడం లేదు". - గ్రామస్థురాలు

"సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏవేవో పథకాలు ఇస్తున్నారు. అవన్నీ మాకు అసలు ఎందుకు. మా ఊరిని ఎక్కడికైనా తరలించి.. మాకు మంచి భవిష్యత్తు ఇవ్వండి అని కోరుకుంటున్నాము. కానీ మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేరు". - గ్రామస్థురాలు

పరిశ్రమల కోసం భూములిచ్చాం.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తున్నాం..!

Last Updated : Oct 16, 2023, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details