ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నష్టపోయిన ప్రతీ రైతును.. ప్రభుత్వం ఆదుకోవాలి' - tdp Rythu Committee news

అకాల వర్షాలు, అసని తుపాను కారణంగా నష్టపోయిన వరి రైతుకు హెక్టారుకు 25 వేల రూపాయల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని తెలుగుదేశం డిమాండ్‌ చేసింది. కోనసీమ జిల్లాలో పర్యటించిన సోమిరెడ్డి నేతృత్వంలోని తెలుగుదేశం రైతు కమిటీ.. వైకాపా ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని దుయ్యబట్టింది.

సోమిరెడ్డి
సోమిరెడ్డి

By

Published : May 14, 2022, 8:22 PM IST

'నష్టపోయిన ప్రతి రైతును.. ప్రభుత్వం ఆదుకోవాలి'

ప్రకృతి విపత్తులతో ఏటా నష్టాలపాలవుతున్న కోనసీమ రైతు.. ఈసారి రబీ సీజన్‌లోనైనా లాభాల తీయాలనుకున్నప్పటికీ వారి ఆశ నిరాశే అయ్యింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, అసని తుపాను కారణంగా పడిన వానలతో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. కోనసీమ జిల్లా గొల్లవిల్లిలో రైతులను వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. కల్లాల్లో ఉన్న పంటతో పాటు ఇంకా పొలాల్లో కోయకుండా ఉన్న వరి పంట కూడా మొలకలెత్తింది. ఈ గ్రామంలో పర్యటించిన తెలుగుదేశం రాష్ట్ర రైతు కమిటీ.. తడిసిన వరి చేలను, పంటను పరిశీలించారు. జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

అధికారులు చెప్పిన వరి రకం వేయడం వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రైతు కమిటీ ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల వల్ల వరి, ఉద్యాన, ఆక్వా సాగుదారులు..తీవ్రంగా నష్టపోయారని తెదేపా నేతలు ఆరోపించారు. నష్టపోయిన ప్రతి వరి రైతుకు హెక్టారుకు 25 వేల రూపాయల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details