Ex Minister Ayyanna comments: ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకి అప్పగించే ముందు అన్నీ రాజకీయ పార్టీలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆర్టీసీ డిపో, బస్‌స్టాండ్‌ను మంజూరు చేయించామని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో తెలిపారు. ఆర్టీసీలో కొంత స్థలాన్ని లీజు ప్రాతిపదికన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థానిక అధికారులు ప్రకటన జారీ చేశారని.. గతంలో తెదేపా హయాంలోనే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టామన్నారు. మళ్లీ అదే ప్రతిపాదనను తెర మీదకు తీసుకురావటం విడ్డూరంగా ఉందన్నారు.
ఆర్టీసీ స్థలాల లీజుపై.. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాలి: అయ్యన్నపాత్రుడు - Rtc land lease
Ex Minister Ayyanna Patrudu: ఆర్టీసీ భూములను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు అప్పగించే ముందు అన్నీరాజకీయ పార్టీలను సంప్రదించాలని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడు సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.
Etv Bharat