TDP leader Ayyanna: అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలిక మల్లవరం వద్ద రిజర్వ్ ఫారెస్ట్‌లో రంగురాళ్లు తవ్వకం ఘటనపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్రం పరిధిలోని గ్రీన్ ట్రిబ్యునల్‌కి ఫిర్యాదు చేస్తున్నట్టు మాజీమంత్రి తెలుగుదేశం పార్టీ సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. నర్సీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు పట్టుకున్నామని అయ్యన్న పేర్కొన్నారు. జేసీబీ, ట్రాక్టర్లు యజమాలు స్వచ్ఛందంగా లొంగిపోవాలని లేకుంటే రాజకీయాలకు అతీతంగా ఎటువంటి వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలకు ఆయన డిమాండ్ చేశారు.. రంగురాళ్ల తవ్వకం వెనక ఎవరున్నా వదిలిపెట్టది లేదని ఆయన పాత్రుడు పునరుద్ధాటించారు.
అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తా..!అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలికమర్లవరం వద్ద రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. దానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనలో ఎవరెవరికి సంబంధం ఉందో అందరిపైనా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లిలో ఆయన వీడియో విడుదల చేశారు. ఈ రంగురాళ్ల తవ్వకం ఘటనలో అటవీ, పోలీస్ శాఖ అధికారుల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై, అటవీ శాఖ అధికారుల ఫోన్లను తక్షణమే స్వాధీనం చేసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రంగురాళ్ల తవ్వకందారుల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తము ఉందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు దీంతోపాటు లెటరైట్ తవ్వకాలు అక్రమ గంజాయి రవాణా తదితర కేసులపై తక్షణమే విచారణ జరిపించాలని అయ్యన్న డిమాండ్ చేశారు.