Anitha on Roads: రహదారులపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవటం లేదని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ది కుంటుపడిందని ఆక్షేపించారు. రహదారుల అధ్వాన పరిస్థితిపై అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకర్గంలో ఆమె పాదయాత్ర చేపట్టారు. ఎస్ రాయవరం మండలం దార్లపూడి నుంచి అడ్డరోడ్డు వరకు పాదయాత్ర చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా.. సీఎం పట్టించుకోవటం లేదు: అనిత - వంగలపూడి అనిత న్యూస్
Anitha Comments on Anitha: వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ది కుంటుపడిందని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. రహదారులపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నా సీఎం జగన్ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా.. సీఎం పట్టించుకోవటం లేదు