ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ర్యాలీ.. 'పవన్​ సీఎం కావాలంటూ' విద్యార్థుల నినాదాలు - వైకాపా ర్యాలీలో జనసేన నినాదాలు

YSRCP Rally: అనకాపల్లి జిల్లా వైకాపా నాయకులకు వింత అనుభవం ఎదురైంది. ఆ పార్టీ నాయకుల ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు జనసేన నేత పవన్​ కల్యాణ్​ ఫొటోతో ఉన్న ప్లకార్డులు పట్టుకుని 'జై పవర్​ స్టార్​', 'పవన్​ సీఎం కావాలి' అని నినాదాలు చేశారు. ర్యాలీతో పాటు, వేదిక వద్ద కూడా నినాదాలు వినపడటంతో వైకాపా నాయకులు నివ్వెరపోయారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Oct 31, 2022, 5:45 PM IST

Pawan Slogans in YSRCP Rally: అనకాపల్లి జిల్లా చోడవరంలో విశాఖ రాజధాని కావాలంటూ.. ప్రభుత్వ విప్ కారణం ధర్మశ్రీ అధ్వర్యంలో విద్యార్థి భేరి పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.. జనసేన పార్టీ గుర్తు, పవన్​ కల్యాణ్​ ఫొటోతో ఉన్న ప్లకార్డులు పట్టుకుని.. 'పవర్​ స్టార్​ జిందాబాద్​' అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా 'పవన్​ సీఎం' కావాలంటూ నినాదాలు చేశారు. మరికొంత మంది విద్యార్థులు విశాఖ రాజధాని కావాలని నినాదాలు చేశారు. ర్యాలీలో చేసిన నినాదాలే కాకుండా.. వేదిక వద్ద కూడా నినాదాలు చేశారు. దీంతో వైకాపా నాయకులు చేసేదేమీ లేక చూస్తుండిపోయారు.

ABOUT THE AUTHOR

...view details