MPTC locked the secretariat office: అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో సచివాలయంలో పని చేస్తున్న మహిళా కార్యదర్శి, సిబ్బందిని లోపల పెట్టి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కర్రీ సంజీవి తాళం వేయడం పలు విమర్శలకు దారి తీసింది. యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు ఆదేశాలతోనే తాను ఇలా చేసినట్లు ఎంపీటీసీ సభ్యురాలు సంజీవి తెలిపింది. గత నెలలో జరిగిన గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించకుండా.. గ్రామ కార్యదర్శి మహమ్మద్ షమీహ అవమానపరిచారని అన్నారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా.. కార్యదర్శిని సచివాలయం నుంచి బయటికి గెంటేసి తలుపు వేయమని చెప్పినట్లు ఎంపీటీసీ సభ్యురాలు పేర్కొన్నారు.
సిబ్బందిని నిర్బంధించి సచివాలయానికి తాళం వేసిన ఎంపీటీసీ.. ఎందుకంటే..! - secretariat office was locked by MPTC
MPTC locked the secretariat office: మహిళా కార్యదర్శితో సహా సిబ్బందిని లోపల నిర్బంధించి సచివాలయ కార్యాలయానికి ఎంపీటీసీ సభ్యురాలు కర్రీ సంజీవి తాళం వేశారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో కలకలం రేపింది. ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఈ ఘనకార్యానికి పాల్పడినట్లు ఆమె చెప్పడం కొసమెరుపు.
ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు, ఆయన కుమారుడి ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను గ్రామ సచివాలయం సమీపంలో ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ.. తీసేయమని గ్రామ కార్యదర్శి షమీహ తెలిపారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు పట్టించుకోకపోవడంతో.. ఈ నెల రెండో తేదీన గ్రామ కార్యదర్శి షమీహ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఎమ్మెల్యే.. గ్రామ కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి.. మెమో జారీ చేశారు. అయితే ఈమెను విధుల నుంచి సస్పెండ్ చేశారని తిరిగి కార్యాలయానికి ఎందుకు వచ్చారంటూ ఎంపీటీసీ సభ్యురాలు సంజీవి.. గ్రామ కార్యదర్శితో వివాదానికి దిగి సచివాలయం లోపల పెట్టి తాళం వేశారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకొని తాళం తీశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామ కార్యదర్శి మహమ్మద్ షమీహ తెలిపారు.
ఇవీ చదవండి: