TIGER Video Viral: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పందూరులో పులి కనిపించిందనే ప్రచారం జరుగుతోంది. గ్రామంలోని పెద్దమ్మ తల్లి ప్రాంగణం వద్ద ఉన్న ప్రధాన రహదారిపై గురువారం అర్ధరాత్రి రోడ్డుకు అడ్డంగా పడుకున్న పెద్దపులి వీడియో వైరల్ అవుతుంది. పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రోడ్లపై వాహనాల రాకపోకలను గమనించి పక్కనే ఉన్న దార్లపూడి అడవిలోకి పారిపోయినట్లు స్థానికులు తెలుపుతున్నారు. అయితే ఇది కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లిలోకి ప్రవేశించిన పులేనా లేక వేరేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Video Viral: అనకాపల్లిలో పులి సంచారం.. భయాందోళనలో స్థానికులు - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు
TIGER: అనకాపల్లి జిల్లాలో పులి సంచరిస్తోందన్న ప్రచారం ప్రజలను కలవరపెడుతోంది. పందూరు గ్రామంలోని పెద్దమ్మ తల్లి తల్లి ప్రాంగణం వద్ద ఉన్న ప్రధాన రహదారిపై పులి అడ్డంగా పడుకుంది. దీన్ని కొంతమంది సెల్ఫోన్లో బంధించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నెల రోజుల పాటు కాకినాడ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం టి-జగ్గంపేట శివారు తాడిపత్రి- శ్రీరాంపురం గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటలో జాడ కనిపించింది. శ్రీరాంపురం గ్రామానికి చెందిన చిన్న అనే రైతు పాడి గేదెపై పులి పంజా విసిరింది. అనంతరం పక్కనే ఉన్న పెద్ద కొండ పైకి వెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న నర్సీపట్నం ఫారెస్ట్ అధికారులు.. పులి సంచరిస్తున్న ప్రదేశాన్ని గుర్తించే పనిలో పడ్డారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: