Road accident in Medchal: తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలంలో స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మెదక్ జిల్లా గుమ్మడిదలకు చెందిన టాటా ఏస్ వాహనంలో వెళ్తున్న 13 మందిలో ముగ్గురు చనిపోయారు.
Road accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం - మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
Road accident in Medchal: తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కండ్లకోయ వద్ద లారీని టాటా ఎస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 9మందికి తీవ్ర గాయాలయ్యాయి.
![Road accident: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16789292-533-16789292-1667183204501.jpg)
మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి వాహనాన్ని ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 9మందికి తీవ్ర గాయాలు కాగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: