Rape on Minor: అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. పక్కింట్లో ఉంటున్న సాయి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాత్రి 2గంటల సమయంలో అక్కాచెల్లెల్లు బహిర్భూమికి వెళ్లగా.. నిందితుడు బాలికను లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని మరో బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు చుట్టుపక్కల వెతికారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. బాలికకు అధికంగా రక్తస్రావమైందని వైద్యురాలు గౌతమి తెలిపారు. బాలిక చికిత్స పొందుతోందని.. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పారు.
అనకాపల్లి జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం..! - అనకాపల్లి లేటెస్ట్ అప్డేట్స్
07:44 May 06
బాలికను ఎత్తుకెళ్లి ఘాతుకం
నిందితుడి వేటకు మూడు బృందాలు: బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు... తల్లిదండ్రులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడి గాలింపు కోసం మూడు బృందాలు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ మణికంఠ తెలిపారు. అత్యాచారం కేసు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం బాలిక వైద్యుల పర్యవేక్షణలో ఉందని చెప్పారు.
ఆర్డీవో పరామర్శ:బాధిత చిన్నారి కుటుంబాన్ని ఆర్డీవో గోవిందరావు పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్నిచర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్‌పై వేటు