RAINS: అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలకు చెట్లు నేలకొరిగాయి. చెట్టుకొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
RAINS: పలు జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం.. నేలకూలిన వృక్షాలు
RAINS: రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. అలాగే కొన్ని చోట్ల ఈదురుగాలులు బీభత్సంతో చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పలు జిల్లాల్లో ఈదురుగాలుల బీభత్సం
తూర్పు గోదావరి జిల్లా:ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో ఓ యజమాని ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బయటకు రావడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది.
ఇవీ చదవండి: