NO ACTION ON COMPLAINT : జగనన్న కాలనీకి స్థలం ఇచ్చిన రైతు.. కాళ్లు అరిగేలా పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెంలో ఆబోతు మహాలక్ష్మి అనే రైతుకి 3.10 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమి ఉంది. దీనిలో జగనన్న ఇళ్ల కాలనీ పేరిట రెవెన్యూ వర్గాలు అతడి నుంచి 2.10 ఎకరాలను సేకరించాయి. ఇందుకు రూ.72 లక్షలు పరిహారంగా ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ పరిహారం నగదును వెంకన్నపాలెం మాజీ సర్పంచి , వైసీపీ బీసీ సెల్ మండలం శాఖ అధ్యక్షుడు మొల్లి సోమునాయుడు, వీఆర్వో బొడ్డు శ్రీను తన చేత సంతకాలు తీసుకుని డబ్బు కాజేశారని సదరు రైతు ఈ ఏడాది మే 30న చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నేతల మాయాజాలం: జగనన్న కాలనీకి స్థలం ఇచ్చి.. పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు
NO ACTION ON POLICE COMPLAINT: జగనన్న కాలనీకి స్థలం ఇచ్చాడా రైతు. స్థలాలు పొందినవారు ఇళ్లు నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు ఇళ్ల పట్టాలంటూ, ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ భూమి ఇచ్చిన రైతు మాత్రం పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఏంటా కథ..! తెలుసుకోవాలంటే.. ఈ కధనం చదవాల్సిందే.
ఫిర్యాదు చేసి ఏడు నెలలు పూర్తైన.. ఎలాంటి చర్యలు లేవని రైతు ఆవేదన చెందుతున్నాడు. జిల్లా అధికారులు, చోడవరం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోయాడు. భూమికి నష్టం పరిహారం వచ్చిందని తనకు చెప్పలేదని.. జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్లు అంటూ తన బ్యాంకు బుక్, ఆధార్ కార్డు, సంతకాలు.. మాజీ సర్పంచి, వీఆర్వో తీసుకున్నారని తెలిపాడు. తన డబ్బులు తనకు అందేలా చేయాలని.. లేదంటే భూమిని తనకి ఇవ్వమని వేడుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.
ఇవీ చదవండి: