సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటన.. విచారణకు కమిటీ నియమించిన ఎన్జీటీ - gas leak in seeds company
22:05 August 03
2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశం
NGT appointed Committee: సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీపై విచారణకు.. ఆరుగురు సభ్యులతో జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీ నియమించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. నోడల్ ఎజన్సీగా కాలుష్య నియంత్రణ మండలి ఉంటుందని తెలిపింది. 2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విషవాయువు వార్తను సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ ప్రిన్సిపల్ బెంచ్.. తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.
Achyutapuram gas leak incident: అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 53 మంది మహిళలు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది జూన్ 3న ఇదే కంపెనీలో విషవాయువు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అదే తరహాలో గాఢమైన విషవాయువు లీక్ కావడంతో.. బీ-షిఫ్టులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాంతులు, తల తిరగడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో వాయువు వెలువడిందని.. కొన్ని నిమిషాల్లోనే వ్యాపించి ఏం జరిగిందో తెలుసుకునే లోపే కుప్పకూలిపోయినట్టు బాధితులు చెబుతున్నారు.
ఇవీ చూడండి