Disabled Persons Pensions Deletion : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పింఛన్ల తొలగింపు కోసం ప్రభుత్వం దివ్యాంగులకు నోటీసులు అందించింది. దీంతో తమ పింఛన్లను తొలగించవద్దని 100 మంది దివ్యాంగులు ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. వివిధ కారణాలు చూపుతూ ప్రభుత్వం వీరి పింఛన్లను తొలగించాటానికి నోటీసులు జారీ చేసింది. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో దాదాపు 700 మంది దివ్యాంగులు పింఛన్ ద్వారా లబ్ది పొందుతున్నారు. అయితే వీరిలో 100 మంది వరకు వివిధ కారణాలు చూపుతూ పింఛన్ తొలగింపు కోసం అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన దివ్యాంగులు స్పందన కార్యక్రమంలో ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.
నర్సీపట్నంలో దివ్యాంగులకు పింఛన్ తొలగింపు నోటీసులు.. ఆర్డీవోకు వినతిపత్రం
Pensions Deletion : సామజిక పింఛన్లలలో కోత వ్యవహరం చివరికి దివ్యాంగుల మీద ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన సన్నహాలు చేస్తోంది. వివిధ కారణాలు చూపుతూ తొలగింపు కోసం నోటీసులు అందిస్తోంది. దీంతో నోటీసులు అందిన దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు.
పింఛన్ తొలగింపు నోటీసులు