Minister Amarnath ‘అమర్‌నాథ్‌రెడ్డిగా పిలిచి నన్ను రెడ్డిగా మార్చకండ’ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ప్రత్యేక ఆర్థికమండలిలో నెలకొల్పిన ఏటీజీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవానికి ఈ నెల 16న ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి శుక్రవారం కంపెనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహ్వానం పలికేవారికి పూర్తిగా అవగాహనలేక తిరుపతిలో అపాచీ కంపెనీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కంపెనీ సీఈఓ, జపాన్ ప్రతినిధులు అందరూ అమర్‌నాథ్‌రెడ్డిగానే సంబోధించి మాట్లాడారని గుర్తుచేశారు. టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో మళ్లీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుర్చీలు ఖాళీగా ఉండకుండా చూడాలని, కంపెనీ తరఫున ఎంతమంది హాజరవుతారో తెలుసుకుని.. మిగిలినవి పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో నింపాలని నిర్దేశించారు.
Minister Amarnath నన్ను రెడ్డిగా మార్చకండి మంత్రి అమర్‌నాథ్ సూచన - change his name to Reddy
Minister Amarnath తనను రెడ్డిగా మార్చకండని పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. అవగాహనలేక తిరుపతిలో అపాచీ కంపెనీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో కంపెనీ సీఈఓ, జపాన్ ప్రతినిధులు అందరూ అమర్‌నాథ్‌రెడ్డిగానే సంబోధించి మాట్లాడారని గుర్తుచేశారు. టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో మళ్లీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంత్రి అమర్‌నాథ్
‘సాక్షి’కి తప్ప ఎవరికీ అనుమతి ఇవ్వొద్దు..:ఏటీజీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సాక్షి పత్రిక, టీవీ, సమాచారశాఖకు తప్ప మిగిలిన ఎవరికీ పాసులు జారీచేయొద్దని మంత్రి అధికారులకు సూచించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సమాచారశాఖ ద్వారా ఇన్‌పుట్‌ను మిగిలిన ఛానెల్స్, పత్రికలు తీసుకుంటాయని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చదవండి: