అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి - Massive explosion in Achyutapuram SEZ
11:46 January 31
జీఎఫ్‌ఎంఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం
Massive Explosion in Achyutapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో గల జిఎఫ్ఎంఎస్ ఫార్మా కంపెనీలో ఈరోజు భారీ పేలుడు సంభవించింది. ఈ కంపెనీ రియాక్టర్ పేలడంతో ఇద్దరు మృతి చెందగా ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరగగానే భయంతో కార్మికులంతా పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మంటలు రావడంతో వీటిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కర్మాగారంలో ఉన్న కార్మికులను బయటకు పంపిస్తున్నారు. కార్మికులు ప్రమాదంపై ఆందోళన చెందడంతో పలువురు అస్వస్థత గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అగ్నిమాపక అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ రియాక్టర్ పేలుడు ఘటనతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను చేపడుతున్నారు.. జిల్లా అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకోవడానికి బయలుదేరారు.
ఇవీ చదవండి: