ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరినాట్లలో అనుకోని అతిథి.. సంబరంలో రైతులు

Anakapally Joint Collector: పంట పొలాలను చూస్తే ఎవరైనా ముగ్దులు కావల్సిందే. రైతులనే కాదు.. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ వ్యవసాయంతో మమేకమవుతారు. ఎంతటి వారైనా సరే.. చివరికి జాయింట్ కలెక్టర్​ కూడా.. ఆమె వరినాట్లు వేసి వ్యవసాయంపై తనకున్న ఇష్టాన్ని నిరూపించుకున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 16, 2022, 5:39 PM IST

Joint Collector Kalpana Kumari: రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.. మరోవైపు వరినాట్లు కొనసాగుతున్నాయి. రైతులంతా వరినాట్ల పనిలో నిమగ్నమయ్యారు. అంతలోనే వారికో వింత అనుభూతి ఎదురైంది. అనుకోని ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి జిల్లాలోని మునగపాక మండలం మంగళవరపు పేటలో పర్యటిస్తున్నారు. ఈలోగా ఆమె రైతులు వరినాట్లు వేయడం గమనించారు. వెంటనే ఆమె వెళ్తున్న వాహనాన్ని ఆపి.. పొలంలోకి దిగి కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. ఐఏఎస్ హోదాలో ఉన్న అధికారిణి తమతో కలిసి నాటు వేయడంతో రైతు కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.

వరినాట్లు వేస్తున్న అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి

ABOUT THE AUTHOR

...view details