ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండ నియోజకవర్గంలో భారీ వర్షం... వాగులో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు - అనంతపురం జిల్లా వార్తలు

Heavy rain: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రాత్రి నుంచి ఈ ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. విడపనకల్ మండలం డోనేకల్లు వద్ద వాగు దాటే సమయంలో బస్సు మధ్యలో ఆగిపోయి ఇరుక్కుంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గ్రామస్థుల సాయంతో బస్సును వాగులోంచి బయటకు తీశారు.

Heavy rain
వాగులో ఇరుక్కున్న బస్సు

By

Published : Sep 5, 2022, 3:01 PM IST

Updated : Sep 5, 2022, 4:08 PM IST

Heavy rain: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరాయి. పలు గ్రామాల వద్ద వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపు నిరంతా పొలాలకు వచ్చి చేరడంతో చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. బెలుగుప్ప తండా, గంగవరం గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఉండబండ వంక, బెలుగుప్ప మండలం రామసాగరం వద్ద వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. విడపనకల్ మండలం డోనేకల్లు వద్ద పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు దాటే సమయంలో ఆర్టీసీ బస్సు ఆగిపోయి మధ్యలో చిక్కుకుంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గ్రామస్థుల సాయంతో బస్సును వాగులోంచి బయటకు తీశారు.

Last Updated : Sep 5, 2022, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details