EDUCATION CHIEF SECRETORY: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పలు విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. దీనిలో భాగంగానే నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పెదబొడ్డే పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పలు తరగతులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి పుస్తకాలను ప్రతి పేజీ పరిశీలన చేసి లోపాలపై ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఒక తరగతిలో గదిలో ఉపాధ్యాయుని పనితీరును పర్యవేక్షించడానికి హెచ్ఎం, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డీఈఓ తదితరులు ఎంతో మంది ఉన్నారని ప్రతి చిన్న లోపాన్ని తాను పరిశీలించలేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న రాయితీలను పథకాలను విద్యార్థులకు నేరుగా అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచేసరికి పిల్లలకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, ఇతర సామాగ్రి అందజేయలని అదే ప్రభుత్వ లక్ష్యమని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. ఇందుకోసం తాను ప్రతి స్కూలు పరిశీలించలేనని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి లోపాలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
నర్సీపట్నంలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రవీణ్ ప్రకాష్ - అనకా పల్లి వార్తలు
EDUCATION CHIEF SECRETORY: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పలు విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో లోపాలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
EDUCATION CHIEF SECRETORY