MLA Baburao: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎమ్మెల్యే బాబురావుకు... మళ్లీ అసమ్మతి సెగ తగిలింది. ఎస్.రాయవరం మండలం గుడివాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వైకాపా చెందిన స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహన శ్రేణిని అడ్డుపడ్డారు. పోలీసు వాహనం ముందు సర్పంచ్ శ్రీనుబాబు, అప్పలరాజు బైఠాయించారు. వారిని పక్కకు తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యేతో విభేదాలు రావడంతో ఎమ్మెల్యేతో విభేదించి నిన్న ఎంపీపీ పదవికి శారదాదేవి రాజీనామా చేశారు.
MLA Baburao : వైకాపా ఎమ్మెల్యే బాబురావుకు మళ్లీ అసమ్మతి సెగ - అనకాపల్లి జిల్లాలో మ్మెల్యే బాబురావుకు అసమ్మతి సెగ
MLA Baburao: పాయకరావుపేటలో వైకాపా ఎమ్మెల్యే బాబురావుకు మళ్లీ అసమ్మతి సెగ అంటుకుంది. స్థానిక నేతలకు ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యేతో విభేదాలు తలెత్తాయి. శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వైకాపా చెందిన స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే బాబురావుకు మళ్లీ అసమ్మతి సెగ