HOSPITAL: వర్షాలు కురుస్తున్న వేళ.. ఆసుపత్రికి వచ్చిన రోగులు గొడుగు కింద వైద్యం పొందాల్సిన పరిస్థితి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొంది. భవనం పైకప్పు పాడై వర్షాలకు కారుతోంది. ఈ ఆసుపత్రిని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న సందర్శించి.. రోగుల ఇబ్బందులు తెలుసుకున్నారు.
వర్షం వస్తే.. ఆ ఆసుపత్రిలో గొడుగు కిందే వైద్యం - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు
HOSPITAL: ఆసుపత్రికి వెళ్తే తప్పనిసరిగా గొడుగులు ఉండాల్సిందే.. ఆసుపత్రి శిథిలం కావడంతో వర్షాలకు కారుతోంది. దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు, గర్భిణీలు, బాలింతలు గొడుగు నీడలోనే వైద్యం పొందాల్సిన దయనీయ పరిస్థితి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొంది.
అనకాపల్లి జిల్లా మండల కేంద్రం దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలమైంది. ఆసుపత్రి అభివృద్ధికి నాడు-నేడులో రూ.45 లక్షలు మంజూరు అయింది. పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా.. అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఏమాత్రం వర్షం వచ్చినా ఆసుపత్రి కారిపోతుంది. దీంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిస్తే రోగులు ఆసుపత్రిలో సైతం గొడుగు నీడలో వైద్యం పొందాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఓ గర్భిణీ ఆసుపత్రిలో వైద్యం జరుగుతుండగా.. తన భర్త వర్షపునీరు కారకుండా గొడుగు పట్టిన దృశ్యం ఆసుపత్రి దుస్థితికి అద్దం పడుతుంది. గర్భిణీలు సైతం గొడుగునీడలోనే వైద్యం పొందారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, అధికారులు స్పందించి ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని రోగులు, సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: