ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ 12మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్​ ఫిర్యాదు.! - Congress complaint on 12 MLAs

Congress complaint on 12 BRS MLAs: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసలే ఎమ్మెల్యేలకు ఎర కేసుపై విచారణ జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్​ పార్టీ సైతం వాళ్ల పార్టీలో జరిగిన ఫిరాయింపులపై దృష్టి సారించింది. అయితే గతంలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు ఫోకస్​ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Congress complaint on 12 BRS MLAs
Congress complaint on 12 BRS MLAs

By

Published : Jan 6, 2023, 12:09 PM IST

Congress complaint on 12 BRS MLAs : తెలంగాణలో ఓ వైపు ఎమ్మెల్యేలకు ఎర కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు దృష్టి సారించింది. గతంలో జరిగిన ఫిరాయింపులపై ఇప్పుడు ఫోకస్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ నుంచి బీఆర్​ఎస్​లోకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.

ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భేటీ కానున్నారు. అనంతరం సీఎల్పీ నుంచి కాంగ్రెస్‌ నాయకుల బృందం మొయినాబాద్ పీఎస్‌కు వెళ్లి.. అక్కడ.. బీఆర్​ఎస్​లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నారు. బీఆర్​ఎస్​లో చేరి 12 మంది ఎమ్మెల్యేలు పొందిన ఆర్థిక, రాజకీయ లబ్ధిపై ఫిర్యాదులో పేర్కొననున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details