CM Jagan Anakapalli Tour postponed: అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. ఇటీవల వాహన ర్యాలీలో.. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గాయపడటంతో.. సీఎం పర్యటన వాయిదా పడినట్లు వైకాపా నేతలు తెలిపారు. ఈ నెల 17న మాకవరపాలెంలో వైద్య కళాశాల శంకుస్థాపనకు సీఎం జగన్ రావాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెం వద్ద స్థల సమీకరణ చేయడంతో పాటు.. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాహన ర్యాలీలో గాయపడ్డ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టడం వల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు నాయకులు తెలిపారు.
సీఎం జగన్ అనకాపల్లి పర్యటన వాయిదా.. అందుకేనా..! - అనకాపల్లి పర్యటన వాయిదా
CM Jagan Tour postponed: వాహన రాలీలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గాయపడటంతో.. సీఎం పర్యటన వాయిదా పడినట్లు వైకాపా నేతలు వెల్లడించారు. ఈ నెల 17న వైద్యకళాశాల శంకుస్థాపనకు సీఎం హాజరు కావాల్సి ఉంది. అయితే, మూడు రాజధానుల మద్దతు వాహన ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే కాలుకి తీవ్ర గాయం కావడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.
CM