ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Diseases in Cattle: పశువులకు అంతుచిక్కని వ్యాధి.. అకాల మృత్యువాతతో రైతన్నల విలవిల - latest news aboput cattle news

Cows skin diseases :అనకాపల్లి జిల్లా చింతలపూడి పంచాయతీ పరిధిలో అంతుచిక్కని వ్యాధితో పశువులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై రైతులు ఫిర్యాదు చేసిన అధికార్లు స్పందించడం లేదు. వేల రూపాయల ఖర్చు చేసి పోషించుకుంటున్న మూగజీవాలు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో తాము నష్టపోతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Skin diseases
Skin diseases

By

Published : Sep 17, 2022, 2:15 PM IST

Skin diseases : అనకాపల్లి జిల్లా చింతలపూడి పంచాయతీ పరిధిలో పశువులు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాయి. కోరాడ, చిన కోరాడ, కొత్తూరు గిరిజన గ్రామాల్లోని పశువులకు చర్మవ్యాధులు వ్యాపించాయి. నెల రోజులుగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో, పలు ఆవులు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని వ్యాధి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొద్ది రోజులుగా పశువులకు వ్యాధులు సోకి చనిపోతున్నా.. పశుసంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైధ్య శిబిరం ఏర్పాటు చేసి వ్యాధి కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Diseases in Cattle

ABOUT THE AUTHOR

...view details