అనకాపల్లి జిల్లాలోని గొబ్బూరు వద్ద డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రూ.2.33 కోట్లు విలువైన 1,169.3 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అనకాపల్లిలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత - అనకాపల్లి వార్తలు
అనకాపల్లి జిల్లా గొబ్బూరు వద్ద డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 1,169 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి రూ.2.33 కోట్లు విలువ చేస్తుందన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న టాటా ట్రక్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తోంది. అనకాపల్లి జిల్లా గొబ్బూరు వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అందులో పాత గోనె సంచుల మధ్య పెద్ద మొత్తంలో గంజాయితో కూడిన తెల్లటి సంచులను స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న డీఆర్‌ఐ అధికారులు సంఘటనా స్థలానికి పరిశీలించగా.. అవన్నీ గంజాయి ప్యాకింగ్ సంచులుగా గుర్తించారు. ఖాళీ గోనె సంచుల మాటున గంజాయి తరలిస్తున్నట్లు విశాఖపట్నం ప్రాంతీయ డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి గంజాయితోపాటు ట్రక్‌ను సీజ్ చేసి పరారైన నిందితుల కోసం గాలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:కాబోయే భర్తకు సర్ ప్రైజ్ అంటూ కళ్లకు గంతలు కట్టింది.. కత్తితో గొంతు కోసి పరారైంది!