అనకాపల్లి జిల్లాలో నాలుగో రోజుకు చేరుకున్న చైతన్య రథ యాత్ర Praja Chaitanya Bus Yatra: భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న చైత్యన రథం బస్సు యాత్ర పలు జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ యాత్రకు టీడీపీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేస్తున్నారు. ఈ యాత్రలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు.
అనకాపల్లి జిల్లాలో.. టీడీపీ చేపట్టిన భవిష్యత్ గ్యారెంటీ చైతన్య రథ యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. చోడవరం నియోజకవర్గంలో యాత్ర నాలుగు మండలాల్లోను సాగింది. కృషి విజ్జాన కేంద్రం, ఎత్తి పోతల పథకం, బాబూ జగ్జీజీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ నేతలు సందర్శించారు. చోడవరంలో జరిగిన సభలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యడు చించకాయల అయ్యన్నపాత్రుడు.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరచుకు పడ్డాడు. చోడవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అధికారుల నుంచి లంచాలు తీసుకుంటున్నాడని విమర్శించారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తక్కవ రకం మద్యంను ఎక్కవ ధరకు అమ్మి ఈ దొంగ సీఎం ప్రజల ధనాన్ని దోచుకుంటున్నాడని విమర్శించారు.. ఉపాధి పథకం కూలీలకు ఎలాంటి సదుపాయాలను ఈ ప్రభుత్వం కల్పించలేదన్నారు. పైగా ఆ డబ్బులను ఇళ్లు నిర్మాణ పనులకు మళ్లించారని అన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాలో.. పెనుకొండ నియోజకవర్గంలోని శెట్టిపల్లి వద్ద భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథ యాత్ర బస్సు ఆదివారం పెనుకొండకు చేరింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ 7.18 కోట్ల నిధులతో నిర్మించిన మరువంక వంతెనపై టీడీపీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీమంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, నిలబడి గతంలో జరిగిన అభివృద్ధిని చూపించారు. అనంతరం శెట్టిపల్లి గ్రామంలో పర్యటించారు. అక్కడి నుంచి పెనుకొండ మండలం కొండంపల్లి ప్రజల దాహార్తిని తీర్చేందుకు గొల్లపల్లి జలాశయం నుంచి పైప్లైన్ తీసుకొచ్చి కుళాయి ఇచ్చిన ప్రదేశంలో నిలబడి ఫోటోలు దిగారు. కొండంపల్లి నుంచి రాంపురం మీదుగా వెంకటరెడ్డి పల్లికి బస్సుయాత్ర నిర్వహించారు. ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
విశాఖలో.. భవిష్యత్ గ్యారెంటీ బస్సు యాత్ర పై విస్తృత స్థాయి సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలలో భవిష్యత్ భరోసా బస్సు యాత్ర జరుగుతుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడులో ఆరు అంశాలతో మినీ మేనిఫెస్టోను విడుదల చేశారని గుర్తుచేశారు.. రాష్ట్రంలో సంపద సృష్టించి మరెన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలనేదే పార్టీ ద్యేయమని మంత్రి అన్నారు.
విశాఖ అంటే ప్రశాంతతకు మారుపేరని.. అలాంటిది ఇక్కడ రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. నగరం మధ్యలో ఎంపీ కుటుంబాన్ని మూడు రోజులు వారి సొంత ఇంట్లో నిర్బంధించారని అన్నారు.. విశాఖలో ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి నగరంలో శాంతిభద్రతల అదుపులో ఉన్నాయని అనడం ఆశ్యర్యానికి గురిచేస్దోందని అన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో టీడీపీని గెలిపించుకోవలసిన అవసరం ఉందని.. విశాఖ పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్రను విజయవంతం చేయాలని గంటా పిలుపునిచ్చారు.