ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ర్యాలీలో అపశృతి.. బైక్​కు నిప్పంటుకుని - అనకాపల్లిలో వైకాపా ర్యాలీలో బైక్​ దగ్ధం

Bike caught fire: మూడు రాజధానులకు అనుకూలంగా చోడవరంలో వైకాపా నిర్వహించిన మానవహారంలో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. బైక్​పై పెట్రోల్​ పోయడమే కాకుండా.. తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించబోయాడు. ఈలోగా అక్కడ ఉన్నవాళ్లు అతన్ని దూరం తీసుకెళ్లారు. ఈలోగా హఠాత్తుగా బైక్​కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి.

Bike caught fire in
వైకాపా ర్యాలీలో బైక్​ దగ్ధం

By

Published : Oct 13, 2022, 5:47 PM IST

Updated : Oct 13, 2022, 6:15 PM IST

Bike caught fire: అనకాపల్లి జిల్లా చోడవరంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రాజధానులకు మద్దతుగా చేపట్టిన మానవహారంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ సారథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా చోడవరంలో బైకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం చోడవరం కూడలిలో మానవహారం చేపట్టారు. మధ్యలో పి.ఎస్.పేటకు చెందిన సి.హెచ్. శ్రీనివాస్ తన బైకును మానవహారం మధ్యలో పడేసి.. పెట్రోల్ పోసి తనపైనా పెట్రోల్ పోసుకున్నాడు. ఆ యువకుడిని ధర్మశ్రీ, కార్యకర్తలు నివారించి వెనక్కి లాగేశారు. ఈలోగా బైక్​కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో వైకాపా కార్యకర్తలు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ జరగకపోటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Last Updated : Oct 13, 2022, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details