ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుపాకీతో బెదిరించి బ్యాంకులో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - తూపాకీతో బెదిరించి పట్టపగలే బ్యాంకులో చోరీ వార్తలు

Bank robbery: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నర్సింగబిల్లి ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో పట్టపగలే చోరీ జరిగింది. బ్యాంకులో చొరబడి క్యాషియర్‌ను తుపాకీతో బెదిరించిన దుండగుడు.. అతని వద్ద ఉన్న 3లక్షల 30వేల రూపాయలను లాక్కొని పరారయ్యాడు.

తూపాకీతో బెదిరించి పట్టపగలే బ్యాంకులో చోరీ
తూపాకీతో బెదిరించి పట్టపగలే బ్యాంకులో చోరీ

By

Published : Apr 30, 2022, 10:08 PM IST

Updated : May 1, 2022, 6:18 AM IST

తూపాకీతో బెదిరించి పట్టపగలే బ్యాంకులో చోరీ

అనకాపల్లి జిల్లాలో పట్టపగలు బ్యాంకులో జరిగిన దోపిడీ ఘటన కలకలం రేపింది. కశింకోట మండలం నర్సింగపల్లిలోని ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో చొరబడిన దుండగుడు తుపాకీతో క్యాషియర్‌ను బెదిరించాడు. అతని వద్ద ఉన్న రూ.3.30లక్షలు లాక్కొని పరారయ్యాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో బ్యాంకు సిబ్బందితో పాటు ఖాతాదారులు కంగుతిన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి ఖాతాదారుడి మాదిరిగా బ్యాగ్‌ తగిలించుకుని, హెల్మెట్‌ ధరించి బ్యాంకులోపలికి వచ్చాడని సిబ్బంది తెలిపారు. దోపిడీ తర్వాత నిందితుడు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Last Updated : May 1, 2022, 6:18 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details