Tentions at Narsipatnam: ఇంటి నిర్మాణానికి అన్ని పత్రాలున్నా.. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే గోడను కూల్చివేశారని అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడిపై కక్షసాధింపు చర్యలను వ్యతిరేకిస్తూ.. తెదేపా నేతలు 'చలో నర్సీపట్నం'కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అయ్యన్న కుమారుడు విజయ్.. ఇంటి వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని విజయ్ కోరారు. వైకాపా ప్రభుత్వంలో బీసీ నేతలకు రక్షణ లేదని అయ్యన్నపాత్రుడి భార్య పద్మావతి అన్నారు. బీసీలను అణగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే అక్రమ కేసులతో కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
"బీసీలను అణగదొక్కాలనే.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు" - అనకాపల్లి జిల్లా వార్తలు
వైకాపా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే.. తమ ఇంటి గోడను కూల్చివేశారని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ అన్నారు. అయ్యన్నపాత్రుడిపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. విజయ్ నిరసన దీక్ష చేపట్టారు.
Chintakayala Vijay initiation in Narsipatnam
TAGGED:
chalo nasripatnam