Ashok Gajapathi Raju comments on YSRCP: వైకాపా అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు విమర్శించారు. సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారని వ్యాఖ్యానించారు. సీఐడీ కేసులో అరెస్ట్ అయిన తెదేపా పాలిటీ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఆయన కుమారుడిని అశోక్ గజపతిరాజు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన విలేకరుల సమావేశంలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైకాపా చేసే అరాచకాలకు ఎదురు చెప్పే నాయకులను అరెస్టుల పేరుతో దౌర్జన్యం చేసి అణగదొక్కాలని చూస్తున్నారని అశోక్ గజపతిరాజు అన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: అశోక్ గజపతి రాజు - చింతకాయల అయ్యన్న పాత్రుడు
Ashok Gajapathi Raju comments on YCP: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నర ఏళ్లలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారని ఆరోపించారు.
![రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: అశోక్ గజపతి రాజు TDP leader Ashok Gajapathi Raju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16853672-498-16853672-1667745364236.jpg)
TDP leader Ashok Gajapathi Raju