ARRANGEMENTS FOR CM TOUR : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్ పర్యటనలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శుక్రవారం ఉదయం బలిఘట్టం చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో జోగినాధుని పాలెం వద్ద ఏర్పాటు చేస్తున్న సభాస్థలికి చేరుకుంటారు. జగన్ పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
రేపు అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన.. బలిఘట్టం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు - arrangements set for cm jagan tour
ARRANGEMENTS FOR CM JAGAN TOUR: రేపు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ పర్యవేక్షిస్తున్నారు.
ARRANGEMENTS FOR CM JAGAN TOUR
Last Updated : Dec 29, 2022, 2:37 PM IST