MLA Ganesh: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రమాదానికి గురయ్యారు. మూడు రాజధానులకు మద్దతుగా నియోజకవర్గంలోని గొలుగొండ మండలంలో బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మండలంలోని కృష్ణదేవీ పేట నుంచి ర్యాలీ నిర్వహించారు. దారి మద్యలో పప్పుసెట్టిపాలెం సమీపంలో ఎమ్మెల్యే గణేష్ నడుపుతున్న వాహనాన్ని మరో వాహనం అదుపు తప్పి ఢీకొనడంతో ఎమ్మెల్యే గణేష్ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయన్ని నర్సీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించి, మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు.
మూడు రాజధానుల మద్దతు ర్యాలీలో అపశ్రుతి.. వైకాపా ఎమ్మెల్యేకు ప్రమాదం - అనకాపల్లిలో ఎమ్మెల్యే గణేష్ బైకు ర్యాలీ
MLA Ganesh: మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లిలో వైకాపా నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం వద్ద ఎమ్మెల్యే గణేష్ నడుపుతున్న బైకును మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయం అయింది.
ఎమ్మెల్యే గణేష్‌కు ప్రమాదం